వేదాంతం
- శరీరములు మూడు. స్థూలము, సూక్ష్మము, మరియు కారణము అని.
- గుణములు మూడు. సత్వం అనగా జ్ఞానం, రజస్సు అనగా శక్తి , మరియు తమస్సు అనగా ద్రవ్యరాశి.
- నాలుగు కులాలు: తమస్సు అనగా అజ్ఞానం, తమస్సు—రజస్సు అనగా అజ్ఞానం + క్రియాశీలత, రజస్సు—సత్వం అనగా సత్కర్మ + జ్ఞానం, మరియు సత్వం అనగా జ్ఞానం.
పుట్టుకతో నిమిత్తములేకుండానే ఏదో ఒక కులములో చేరవచ్చు. జీవితములో అతడు సాధించడానికి ఎంచుకున్న లక్ష్యము వలన అయే సహజశక్తులమీద ఆధారపడిఉంటుంది.
- కామం అనగా కోరిక అనగా ఇంద్రియాలే తాననుకొని గడిపే జీవితం శూద్రదశ.
- అర్థం అనగా లాభార్జనం చేస్తూనే కోరికలను అదుపులో ఉంచుకొనే వైశ్యదశ.
- ధర్మం అనగా స్వయంశిక్షణతోనూ , బాధ్యతతోనూ , సత్కర్మతోనూ గడిపే క్షత్రియదశ.
- మోక్షం అనగా విడుదల, మతధర్మ బోధనలతో కూడిన జీవితము బ్రాహ్మణదశ.
ఈ నాలుగు కులాల మానవులకు సేవ చేయడానికి ఉపకరించే సాధనములు శరీరము, మనస్సు, సంకల్పశక్తి మరియు ఆత్మ.
సనాతన ఋషులు చెప్పిన మాయను ఆధునిక కాలము లోని గొప్ప ఆవిష్కరణలు ధృవీకరణ చేశాయి.
ఉదాహరణకు ఒకే ఒక చర్యను చూడటం అసంభవం అని మన ఋషులు చెప్పినదే సమానంగానూ, వ్యతిరేకంగాను రెండు బలాలు ఉంటాయి అని న్యూటన్ సిద్ధాంతము దీనికి ఉదాహరణ.
- కారణ విశ్వం భావముల ఆనందమయ లోకం. ఇది సూక్ష్మ విశ్వం కంటే ఎన్నోరెట్లు పెద్దది.
- దాని తరువాతది హిరణ్యలోకం. ధ్యానశక్తిగల సాధకుల లోకమే హిరణ్యలోకం. ఈ హిరణ్యలోకములో సద్భక్తులు , మంచి సాధకులు తమతమ కర్మబీజములను దగ్ధము చేసికుంటారు.
- దాని తరువాతది సూక్ష్మలోకం. ఈ సూక్ష్మలోకంలో భూమి మీద అంతకు క్రితమువి మరియు అప్పుడే మరణించిన జీవులన్నీ ఉంటాయి. అవి తమతమ గుణకర్మలననుసరించి వివిధ క్షేత్రాలలో నివసిస్తారు, వివిధ క్షేత్రాలలో సంచరించే స్వేఛ్ఛ వారు వారు చేసికున్న పుణ్యము ప్రకారము ఉంటుంది. ఎక్కువ పుణ్యం చేసికున్న వారు తక్కువ పుణ్యం చేసికున్న వారి క్షేత్రాలలో సంచరించే స్వేఛ్ఛ ఉంటుంది.
పరమాణుశక్తి, ఆ తరువాత పదార్ధము పుట్టాయి. భూసంబంధమైన అణువుల్ని సమన్వయపరిచి ఈ విధమైన ఘన గోళముగా రూపొందించినాడు. కేవలం పరమాత్మ సంకల్పం చేత కూడియుంటాయి, వికల్పము చేత విడిపోయి శక్తిగా పరివర్తన చెందుతాయి. అణుశక్తి తన మూలచైతన్యము లోనికి వెళ్ళిపోతుంది, భూభావం స్తూల(త)త్వము లోంచి అదృశ్యం ఔతుంది. మనిషి స్వప్నంలో సృష్టించే విశ్వములు కూడా దేవుని మౌళిక ఆదర్శాన్ని అనుసరించి అప్రయత్నముగానే కరిగిస్తాడు.
- పరిపూర్ణసిద్ధిని పొందినవాడు సిద్ధుడు.
- జీవించిఉండగానే ముక్తిని పొందినవాడు జీవన్ముక్తుడు.
- సర్వోత్కృష్ట స్వతంత్రుడు అనగా మృత్యుంజయుడుని పరాముక్త అంటారు.
జ్యోతిషామపితజ్జ్యోతిః సమస్తః పరముచ్యతే
జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హ్రుదిసర్వస్య విష్ఠితం గీత ---13—18
సూర్యునికి, చంద్రునికి, మరియు అగ్నికి ప్రకాశము నిచ్చునది, అజ్ఞానముకంటే అతీతమైనది, జ్ఞానస్వరూపమయినదియు, పొందతగినదియు, సమస్తప్రాణులయొక్క హృదయమునందు ఉన్నది ఆ పరమాత్మే.
ఆదిత్యానాం అహం విష్ణుః జ్యోతిషాం రవిరంశుమాన్
మరీచిర్ మరుతామస్మి నక్షత్రాణాం అహం శశీ. గీత ---10—21
నేను ఆదిత్యులలో విష్ణువును, ప్రకాశింపజేయువానిలో కిరణములుగల సూర్యుడను, మరుత్తులను దేవతలలో మరీచియనువాడను, నక్షత్రములలో చంద్రుడను అయియున్నాను.
యదాదిత్యగతం తేజో జగద్భాసయతెఖిలం
యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధిమమకం గీత ---15—12
సూర్యునియందున్నా ఏ తేజస్సు ప్రపంచమునంతను ప్రకాశింపజేయుచున్నదో, అట్లే చంద్రునియందును , అగ్నియందును ఏ తేజస్సు గలదో , ఇదియంతయు నాదిగా నెఱుగుము.
మయ్యాధ్యక్షేణ ప్రకృతిః సూయతే సచరాచరం
హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే గీత ---9—10
ఓ అర్జునా! అధ్యక్షుడనై (సాక్షీభూతుడనై యున్న నాచేత ప్రకృతి చరాచర ప్రపంచమునంతను సృజించుచున్నది. ఈ కారణముచేతనే జగత్తు ప్రవర్తించుచున్నది.