ᐅబ్రహ్మ సత్యం జగన్మిధ్య


బ్రహ్మ సత్యం జగన్మిధ్య  ~ జీవొ బ్రహ్మైవ నా పరః

బ్రహ్మమొక్కటే సత్యం. జగత్తు మిధ్య. ఈ జీవుడే బ్రహ్మం. జీవుడు, బ్రహ్మము వేరు కాదు. - ఇదే శంకరుని మాయావాదంగా ప్రసిద్ధమైనది. అయితే కంటికి కనిపిస్తున్న జగత్తు మిధ్య కావడమేమిటి? ఏనుగు తరుముకొస్తుంటే పారిపోవక తప్పదు కదా? - ఇందుకు మాయావాదం వివరణ : జగత్తులో జీవిస్తున్నంతకాలం దాని ఉనికి అనే భావనకు తగినట్లుగానే (అనగా అది యదార్ధమన్నట్లుగానే) ప్రవర్తించాలి. ఎప్పుడైతే ఇదంతా మిధ్య అన్న జ్ఞానం గోచరమౌతుందో అపుడు అందుకు అనుగుణమైన ప్రవర్తన దానంతట అదే వస్తుంది.

ఈ జీవితంలో సుఖం అనిపించేది ఒక భ్రమ. మరి ఈ ఎడతెరిపి లేని దుఃఖానికి కారణం ఏమిటి? "ఆత్మానాత్మ వివేకం" అనే ప్రకరణ గ్రంధంలో ఇలా వివరించాడు -

ఆత్మ ఈ శరీరాన్ని ఎందుకు ధరించవలసి వస్తున్నది?

  • పూర్వ జన్మ లలోని కర్మ వలన.


కర్మ ఎందుకు జరుగుతుంది?

  • రాగం (కోరిక) వలన.


రాగాదులు ఎందుకు కలుగుతాయి?

  • అభిమానం (నా, నాది, నేను, కావాలి అనే భావం) వలన.


అభిమానం ఎందుకు కలుగుతుంది?

  • అవివేకం వలన


అవివేకం ఎందుకు కలుగుతుంది?

  • అజ్ఞానం వలన


అజ్ఞానం ఎందుకు కలుగుతుంది?

  • అజ్ఞానానికి కారణం లేదు. అది అనాదిగా ఉన్నది. (వెలుగు లేని చోట చీకటి ఉన్నట్లుగా. అందుకు కారణం ఉండదు.)

దాని పుట్టుక ఎవరూ ఎరుగరు. అది మాయ. త్రిగుణాత్మకం. జ్ఞానానికి విరోధి. అదే అజ్ఞానం.
అనగా అజ్ఞానం వలన అవివేకం, అవివేకం వలన అభిమానం, అభిమానం వలన రాగాదులు, రాగాదుల వలన కర్మలు, కర్మల వలన పునర్జన్మ (శరీర ధారణ), అందువలన దుఃఖం కలుగుతున్నాయి.


ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత -- ఈ మూడింటినీ కలిపి ప్రస్థానత్రయి అన్నారు. వీటికి అన్నిటికీ సమన్వయం చేకూర్చి, వాటి భావం > వేదముల లక్ష్యము > జీవాత్మ, పరమాత్మల ఏకత్వ భావనే ప్రాతిపదిక.