ᐅరామవాక్కు



--------------------------------------------------
శ్రీ రామ నవమి సందర్భం గా - శ్రీ రామవాక్కు
--------------------------------------------------

నాకు సంపద మీద ఆసక్తి లేదు. ఆశాలేదు. ధర్మాన్ని కాపాడటమే నా లక్ష్యం. ధర్మమార్గంలో నడవడంలో నేను రుషులతో సమానం
.
యజమాని తనకు అప్పగించిన పనిని, ఆశించినదాని కంటే అద్భుతంగా పూర్తిచేస్తే అతను ఉత్తమ ఉద్యోగి. అంతకంటే బాగా చేయగల సమర్థుడై ఉండి కూడా, ఆశించినమేరకు మాత్రమే చేసేవాడు మధ్యముడు. ఏమాత్రం నాణ్యత లేకుండా మొక్కుబడిగా చేసేవాడు అధముడు
.
సత్యానికీ ధర్మానికీ కట్టుబడి ఉన్నవారిని ప్రాణభయం వెంటాడదు
.
పామును చూసి ఎలా పక్కకెళ్లిపోతారో, అసత్యాత్ములను చూసి కూడా జనం అలానే భయపడతారు
.
భర్తకు భార్య విషయంలో జీవితకాల బాధ్యత ఉండాలి. భార్య కూడా జీవిత పర్యంతం తన భర్తను తప్ప మరెవరినీ అనుసరించకూడదు
.
ప్రతి మనిషికీ పితృభక్తి ఉండాలి. దేవతల కంటే తల్లిదండ్రులే ఎక్కువ. కన్నవారిని ప్రేమించలేని బిడ్డల పూజల్ని దేవుళ్లూ స్వీకరించరు