ᐅశ్రీ రామ నీతి



----------------------------------------------
శ్రీ రామ నీతి - ఆచరనీయం ఆదర్శనీయం 
----------------------------------------------

రాముడు ధర్మాన్ని గెలిపించడానికి యుద్ధం చేశాడు, శత్రువును గెలవడానికి కాదు. లాభార్జనే వ్యాపార ప్రయోజనం. ఎవరూ కాదనలేరు. కానీ ఆ లాభం చెమటోడ్చి సంపాదించినదై ఉండాలి, జలగలా ఎవరి రక్తాన్నో పీల్చి కాదు. 'నేను తలుచుకుంటే ఈ భూమండలాన్ని మొత్తం జయించగలను. కానీ, అధర్మమార్గంలో దేవేంద్ర పదవి లభించినా కూడా స్వీకరించను. అలాంటి సామ్రాజ్యం విషం కలిపిన భోజనం లాంటిది' అని చెప్పాడు. ఈ మాట కార్పొరేట్‌ ప్రపంచానికీ వర్తిస్తుంది.

ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ సదస్సులో మార్కెటింగ్‌గురు ఫిలిప్‌ కోట్లర్‌ ఆసక్తికరమైన వ్యాఖ్యానం చేశారు. 'అమెరికా వస్తువాదంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. చైనా వ్యాపారవాదంలో మునకలేస్తోంది. ఇక మిగిలింది భారతదేశం. ఆధ్యాత్మికతకూ వ్యాపారానికీ మధ్య సమతూకం పాటించే శక్తి భారత్‌కు ఉంది' అన్నారాయన. కోట్లర్‌ చెప్పిన ఆధ్యాత్మికతకు మూలం ధర్మం. ఆ ధర్మానికి ప్రతిరూపం శ్రీరాముడు.

రామో విగ్రహవాన్‌ ధర్మః